News March 9, 2025
ADB: నేటి నుంచి గ్లాకోమా వారోత్సవాలు

ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
Similar News
News March 22, 2025
ADB: పరీక్షకు 23 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,039 మంది విద్యార్థులకు గాను 10,016 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించినట్లు వివరించారు.
News March 22, 2025
గుడిహత్నూర్: బాలికకు అబార్షన్.. RMP అరెస్ట్

బాలికకు అబార్షన్ చేసిన కేసులో RMP వైద్యుడు సూర్యవంశీ దిలీప్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామంలో ఇటీవల పసికందు మృతదేహం లభ్యం అవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా 15 ఏళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతడి క్లినిక్‌ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.
News March 22, 2025
ADB: ఈ నెల 23 నుంచి రెండో విడత కరెక్షన్

ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.