News March 24, 2025
ADB: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
News December 6, 2025
విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.
News December 6, 2025
NRPT జిల్లాలో ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: కలెక్టర్

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రకటించారు. మొదటి, రెండవ విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాలలో కూడా నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. తుదిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి గ్రామంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


