News June 4, 2024
ADB: నేడే కౌంటింగ్.. గంటకు నాలుగు రౌండ్లు
ఆదిలాబాద్ పార్లమెంట్‌లో మొత్తం 156 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో టేబుల్‌పై 14 ఈవీఎంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఉండగా 12,21,583 ఓట్లు పోలయ్యాయి. 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్ ఉండగా ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. గంటకు నాలుగు రౌండ్లు చొప్పున లెక్కించనున్నారు.
Similar News
News September 21, 2024
ఉట్నూర్: నేడు మంత్రి సీతక్క రాక
ఈనెల 21న శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క రానున్నట్లు ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ తెలిపారు. మంత్రితో పాటు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గజేందర్, అదిలాబాద్ శ్రీనివాస్ రెడ్డి, సత్తు మల్లేశ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
News September 20, 2024
ADB: వీధికుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
ఆదిలాబాద్‌లోని గాంధీనగర్‌లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. కాలనీలో శుక్రవారం ఆరుగురిపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 20, 2024
నిర్మల్ : సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం: ఎస్పీ
పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలరోజుల ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు.