News April 10, 2024

ADB: పగలు ఎండ… రాత్రిపూట వర్షం !

image

మంగళవారం ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం కనిపించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మేఘావృతమై చల్లటి వాతావరణం కనిపించగా 8 గంటల తర్వాత సూర్యుని ప్రతాపం కనిపించింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 4 గంటల తర్వాతా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడి చల్లటి గాలులు వీచాయి రాత్రి 8 గంటల తర్వాతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

Similar News

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతపై పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా నియమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.