News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News March 19, 2025
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.
News March 19, 2025
బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 19, 2025
ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.