News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News October 23, 2025
జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపిక

పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి గ్రామానికి చెందిన తప్పెట పవన్ కుమార్ జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపికయ్యాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అక్టోబర్ 11 నుంచి 14 వరకు జరగనున్న 16వ సౌత్ జోన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ పోటీల్లో అతను తెలంగాణ తరపున పాల్గొననున్నాడు. పవన్ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News October 23, 2025
పర్వతగిరి: రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఏజెంట్లు..!

<<18081238>>సీడ్ పేరుతో రైతులను నట్టేట ముంచారని గురువారం<<>> “Way2News”లో ప్రచురించిన కథనానికి గాను గ్రామానికి చెందిన ఏజెంట్లు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతులకు సంబంధించిన రూ.70 లక్షలను నవంబర్ 10వ తేదీ వరకు చెల్లిస్తామని, చెల్లించకపోతే గ్రామంలో తమకున్న భూమిని జప్తు చేసుకునే అధికారం రైతులకు కల్పిస్తూ అగ్రిమెంట్ పత్రం రాసి ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా రైతులు శాంతించారు.
News October 23, 2025
చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.