News March 19, 2024
ADB: పదో తరగతి విద్యార్థిపై ఊడిపడిన పైకప్పు
పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులపై తరగతి గది పైకప్పు ఊడిపడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జైనథ్ మండలం గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గది పైకప్పు ఉడిపడింది. దీంతో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్ధిని అక్షయ, ఉపాధ్యాయుడు పురుషోత్తమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థినిని వెంటనే స్థానిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
Similar News
News September 7, 2024
కుబీర్: వినాయక చవితికి స్పెషల్ ఈ కర్ర గణపతి
వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.
News September 7, 2024
నిర్మల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్‌లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.
News September 6, 2024
వినాయక చవితిని శాంతియుతంగా జరిగేలా చూడాలి :కలెక్టర్
వినాయక చవితి పండుగ ను శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.