News March 11, 2025

ADB: పనిప్రదేశాల్లో వేధింపులా కాల్ కొట్టండి

image

మహిళా హెల్ప్ లైన్ 181కు కాల్ చేసి లేదా www.shebox.nic.in వెబ్సైట్ ద్వారా లేదా లిఖిత పూర్వకంగా ఐసీసీ లేదా ఎల్సీసీకి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. యాక్ట్ 2013 పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక నివారణా పరిష్కార చట్టంపై సోమవారం కలెక్టరేట్ అవగాహన కల్పించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతీ కార్యాలయంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Similar News

News March 25, 2025

ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

image

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.

News March 25, 2025

ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

గాదిగూడ: తల్లిదండ్రులు మృతి.. అనాథగా పిల్లలు

image

అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రులను దూరం చేసి వారిని అనాథలుగా మార్చింది. గాదిగూడలోని దాబా(కే) గ్రామానికి చెందిన సోయం కిషన్(37) అనారోగ్యంతో శనివారం మృతిచెందగా ఆయన భార్య తూర్పబాయి 2021లో మృతిచెందింది. దీంతో వారి పిల్లలు దేవరావు, రాజేశ్వరి అనాథలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని దాతలు ఆదుకొని భవిష్యత్తుకు దారి చూపాలని వేడుకున్నారు.

error: Content is protected !!