News March 22, 2025
ADB: పరీక్షకు 23 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,039 మంది విద్యార్థులకు గాను 10,016 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించినట్లు వివరించారు.
Similar News
News March 28, 2025
ADB: తెలుగు నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో శుక్రవారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్, పడకంటి సూర్యకాంత్, బండారి వామన్, కందుల రవీందర్ తదితరులు ఉన్నారు
News March 28, 2025
ఇచ్చోడ: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఇచ్చోడలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. SI పోలీసుల వివరాలు.. బోథ్ మండలం సాకేరాకి చెందిన ధనుశ్(12) తల్లి లక్ష్మితో కలిసి బుధవారం బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు వచ్చాడు. గురువారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఊరి బయట ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News March 28, 2025
ADB: గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కేఆర్కే కాలనీకి చెందిన నితిన్ మసూద్ చౌక్ సమీపంలో గురువారం బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 1-టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ రిమ్స్‌కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు.