News March 23, 2024

ADB: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లే కీలకం

image

ప్రత్యేక ఓటరు సవరణ తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 16,43,604 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,02,267 మంది పురుషులు, 8,41,250 మంది మహిళలు, 87 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిర్పూర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్థుల జయాపజయాల్లో మహిళా ఓటర్లే కీలకం.

Similar News

News September 12, 2024

జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఎస్పీ ఎంపీ

image

జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News September 12, 2024

నిర్మల్‌: అన్నను నరికి చంపిన తమ్ముడు

image

అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2024

ASF: ‘మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి’

image

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని బీసీ యువజన సంఘం జిల్లాధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మికు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.