News April 6, 2025
ADB: పాలిటెక్నిక్లో ప్రవేశాలకు POLYCET

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.