News January 2, 2025

ADB: పెద్దపులి దొరికిందోచ్..!

image

ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News January 22, 2025

నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి

image

నిర్మల్‌లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News January 22, 2025

నాగోబా జాతర విశేషాలు మీకు తెలుసా..!

image

తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. మేస్రం వంశీయులు ఇప్పటికే గంగాజలం తీసుకొని రావడానికి జన్నారంలోని కలమడుగుకు బయలుదేరారు. అయితే వారు జలం తీసుకొచ్చే కుండులను ఓ ప్రత్యేక వంశీయులే చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ కుండలను సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. మేస్రం వంశీయులు పూజకు వినియోగించే దీపంతలు, నీటికుండలు, వంట ఉపయోగించే పాత్రలను కూడా వారే అందిస్తారు.

News January 22, 2025

ADB: భారత జట్టులో ఆదిలాబాద్ ఉద్యోగి

image

దిల్లీలో నిర్వహించిన ఖోఖో అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీ అందుకున్న టీంలో సభ్యుడిగా ఆదిలాబాద్ తపాలా ఉద్యోగి ఉన్నారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పోస్టల్ అసిస్టెంట్ శివారెడ్డి భారత జట్టు తరఫున ఆడారు. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్ లోనే బెస్ట్ అటాకర్‌గా పేరు పొందారు. భారత ఖోఖో జట్టు విశ్వ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు తపాలా శాఖ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.