News March 18, 2025
ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.
Similar News
News April 22, 2025
ADB: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష వచ్చే ఆదివారం ఏప్రిల్ 27న ఉంటుందన్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7-10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
News April 22, 2025
ADB: పాపం.. 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేశారు..!

నేరడిగొండ మండలంలోని ఓ బాలిక(16)కు మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
News April 22, 2025
ADB: వడదెబ్బతో ఒకరి మృతి

వడ దెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన నార్నూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్(60) ప్రతి రోజు వెళ్లినట్లుగా సోమవారం ఉపాధిహామీ పనికి వెళ్లి పని పూర్తిచేసుకొని తిరిగి ఇంటికొచ్చాడు. దాహంగా ఉండడంతో మంచినీరు తాగి సేద తీరుతామని మంచంపై కాసేపు పడుకుంటామని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడికే కుప్పకూలిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరారు.