News August 6, 2024

ADB: ప్రశంస పత్రాలు అందుకున్న పోలీసు అధికారులు

image

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ACP, CIలకు DGP జితేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మంచిర్యాల రూరల్ CI అశోక్ కుమార్, మందమర్రి CI శశిధర్ రెడ్డి, శ్రీరాంపూర్ CI మోహన్‌లు వీరు పనిచేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసులో కేసు నమోదు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేశారు.

Similar News

News April 19, 2026

ADB: 7 పరీక్ష కేంద్రాలు.. 1484 మంది విద్యార్థులు

image

ఆదిలాబాద్‌, ఉట్నూర్‌లలో సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. పదవ తరగతి కోసం 4, ఇంటర్ కోసం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,484 మంది అభ్యాసకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.

News April 19, 2026

సప్లిమెంటరీ అభ్యర్థులకు స్పెషల్ కోచింగ్: ADB DIEO

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని DIEO జాదవ్ గణేశ్ కుమార్ ఆదేశించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు సమన్వయంతో విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News April 19, 2026

ADB: రేపటి నుంచి OPEN టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యాసకులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, కేవలం పెన్, ప్యాడ్ మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.