News March 23, 2024
ADB: ఫలితాలు ప్రకటించకముందే మరొక షెడ్యూల్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్-జనవరి నెలలో రాసిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటివరకు వెలువడలేదు. ఫలితాలు రాకముందే మరో పరీక్షల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారంటూ డిగ్రీ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వెంటనే 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News December 7, 2025
ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: ‘COC సభ్యత్వానికి డబ్బులు ఇవ్వొద్దు’

ఆదిలాబాద్లోని వ్యాపారులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యత్వం పేరిట డబ్బులు ఇచ్చే అవసరం లేదని, ఇప్పటికే అమాయకుల నుండి డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తి పై ఎస్పీకి ఫిర్యాదు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. ఎవరైనా బాధితులు డబ్బులు ఇచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వివరాలు ఇవ్వాలన్నారు.
News December 7, 2025
బోథ్: ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావద్దు: ఎస్పీ

రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాత్రి బోథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


