News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News April 16, 2026

27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.

News April 16, 2026

సిరిసిల్ల: పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం: ఎస్పీ

image

ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ఆయన కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. భానుడి భగభగలకు సిబ్బంది ఇబ్బంది పడకూడదని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News April 16, 2026

అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్‌కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్‌గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్‌ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్‌‌గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, IDBI పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్‌ దీనిని పక్కన పెట్టింది.