News August 15, 2024
ADB: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి రిమాండ్
ఆదివాసీ బాలిక(17)ను ప్రేమపేరుతో మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాధిత బాలికను ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌కు చెందిన ముబాషిర్ 6 నెలలుగా ప్రేమపేరుతో మభ్యపెడుతూ లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News September 14, 2024
తానూర్: వినాయకునికి 108 రకాల నైవేద్యం
తానూర్ మండలం బోసి గ్రామంలో వినాయక నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకునికి శుక్రవారం ఏడవ రోజు భక్తులు భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
News September 13, 2024
ఆదిలాబాద్: రూ.818కే విద్యుత్ మీటర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్‌కి రూ.938, 250 వాట్స్‌కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.
News September 13, 2024
నిర్మల్ : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై మండలాల వారీగా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చలన్నారు.