News February 11, 2025
ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Similar News
News October 19, 2025
PHOTOS: పార్వతీపురం ఘటనలో గాయపడ్డ వారు వీరే

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణసంచా <<18049906>>పేలిన ఘటన<<>>లో ముగ్గురు గాయపడ్డారు. బస్సు నుంచి క్రాకర్స్ పార్శిల్ బాక్స్ దింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. క్షతగాత్రులను పై ఫొటోలలో చూడొచ్చు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News October 19, 2025
ఖమ్మం: డబుల్ బెడ్రూం ఇళ్లు.. గేదెలకు కట్టారా?

వైరా(M) గరికపాడులో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ఆవరణ ప్రస్తుతం గేదెలకు కొట్టాలుగా మారాయి. ఈ ఇళ్లలో గేదెలను కడుతున్న యజమానులను గ్రామ కార్యదర్శి హెచ్చరించినా, 2 సార్లు నోటీసులు ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదు. గత నెల 9న గ్రామసభలో MRO సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తి చేసి, అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.