News February 11, 2025
ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్‌కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో BRSకు తగ్గిన ఓట్లు!

గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే BRSకు ఈసారి ఓట్లు తగ్గాయి. 2014లో అప్పటి TRS అభ్యర్థి రాములు ముదిరాజ్‌కు 18,436 ఓట్లు రాగా 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 68,979 ఓట్లు వచ్చాయి. 2023లో BRSఅభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,550 ఓట్లు రాగా ఈ ఉపఎన్నికలో మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికతో పోల్చితే 6,291 ఓట్లు తక్కువగా వచ్చాయి. మైనార్టీలు కాంగ్రెస్ వైపు మళ్లడమే ప్రధాన కారణమని టాక్.
News November 14, 2025
పాడేరు ఐటీడీఏ గ్రీవెన్స్‌కు 112 అర్జీలు

పాడేరు ఐటీడీలో శుక్రవారం జరిగిన మీకోసం ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ (గ్రీవెన్స్)లో 112 అర్జీలు స్వీకరించారు. పాడేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ లోకేశ్వరరావు డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కారానికై సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు.
News November 14, 2025
చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్‌లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.


