News February 22, 2025

ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

image

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్‌ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై <<15540332>>అత్యాచార<<>> ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 27, 2025

ప.గో: ‘పందెం కోడిలా జగన్‌పై పోరాడతా’

image

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే తన ఏకైక లక్ష్యమని, ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగానే పందెం కోడిలా పోరాడతానని డిప్యూటీ స్పీకర్ RRR స్పష్టం చేశారు. ఉండిలో అభివృద్ధి పనుల కోసం కాలువ గట్లపై ఉన్న కట్టడాలను తొలగిస్తుంటే కేవలం చర్చిలను మాత్రమే తొలగిస్తున్నట్లు జగన్ అనుకూల వెబ్ జర్నలిస్టులు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఉన్నా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు

News December 27, 2025

రేపు పాక హనుమంతు అంత్యక్రియలు

image

మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు చండూరు మండలం పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు.

News December 27, 2025

జగిత్యాల: మొన్నే పోస్టింగ్.. ఇంతలోనే గుండెపోటుతో మృతి

image

జగిత్యాల జిల్లా వైద్యాధికారి(DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 4:30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా నియమితులైన శ్రీనివాస్ మృతి చెందడంతో వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.