News April 5, 2024
ADB: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి నియామకం ఎప్పుడు..?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఇప్పటికే MP అభ్యర్థులను ప్రకటించాయి. వారితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా BJP.. MLA పాయల్ శంకర్‌ను, కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కను నియమించింది. BRS పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. ఒకవైపు జోగు రామన్న పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈనెల 5 తర్వాత ఈ విషయంపై స్పష్టత రావచ్చని సమాచారం.
Similar News
News January 20, 2025
నార్నూర్ ఘాట్ రోడ్డు భద్రతపై ముందే హెచ్చరించిన Way2news
నార్నూర్ నుంచి మలంగి గ్రామానికి వెళ్లే దారిలో వచ్చే ఘాట్ రోడ్డు భద్రతపై Way2news ముందే హెచ్చరించింది. ఇటీవల రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉందని పలు కథనాలు ప్రచురించింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రజలు Way2news కథనాలపై చర్చించుకున్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు.
News January 20, 2025
బాసర: ఫిబ్రవరిలో వసంత పంచమి వేడుకలు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం,అధికారులు ఫిబ్రవరి 01.02.2025 నుండి 03.02.2025 వరకు అమ్మవారికి విశేష పూజలు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు.
News January 20, 2025
నిర్మల్ కవులకు జాతీయ పురస్కారాలు
నిర్మల్ జిల్లాకు చెందిన కవులు జాతీయ పురస్కారాలను ఆదివారం అందుకున్నారు. కరీంనగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా గౌతమేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానంలో అంబటి నారాయణ సాహితీ రత్న, నేరెళ్ల హనుమంతుకు సాహితి కిరణం పురస్కారాలను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు నిరంతరాయంగా కవిత్వాలను రాయడంతో అవార్డుకు ఎంపిక చేశామని వ్యవస్థాపకులు గౌతమేశ్వర తెలిపారు.