News February 3, 2025
ADB: బీజేపీ బాధ్యతలు బ్రహ్మానంద్‌కే..!

భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతాంగె బ్రహ్మానంద్ నియమితులయ్యారు. దీంతో ఆయన రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 15, 2025
102 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపర్చిన వారే: నరేష్ జాదవ్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నదని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మొత్తం 156 గ్రామ పంచాయతీ స్థానాల్లో 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని, దీంతో ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News December 15, 2025
వందశాతం పోలింగ్ లక్ష్యం: ADB కలెక్టర్

మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఎన్నికల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామాల్లో వందశాతం పోలింగ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు.
News December 15, 2025
జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.


