News April 3, 2025

ADB: బీమా కార్యాలయం స్థలం మార్పు

image

ఆదిలాబాద్ సంజయ్ నగర్ కాలనీ, పోలీస్ లైన్‌లో ఉన్న జిల్లా భీమా కార్యాలయాన్ని రాంనగర్, మావలలోని SBIపై అంతస్తులోకి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీమా పాలసీదారులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News December 9, 2025

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురికి జైలుశిక్ష: VZM SP

image

విజయనగరం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చగా.. ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి 20, 15, 6, 5 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఆకస్మిక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ దామోదర్ చెప్పారు.

News December 9, 2025

HYD: GHMCలో 300 వార్డులు.. మీకు అబ్జెక్షన్ ఉంటే చెప్పండి.!

image

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిని 300 ఎన్నికల వార్డులుగా విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనలు, 1996 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. వార్డుల సరిహద్దుల వివరాలు www.ghmc.gov.in వెబ్‌సైట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 7రోజుల్లోపు అభ్యంతరాలు, సూచనలు దాఖలు చేయాలని కమిషనర్ కోరారు.

News December 9, 2025

మొదటి విడత ఎన్నికల పోలింగ్ రోజున సెలవు: కలెక్టర్

image

జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి మండలాల్లో ఈ నెల 11వ తేదీన పోలింగ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. పోలింగ్ రోజుకు ముందు రోజు, పోలింగ్ రోజున విద్యా సంస్థల భవనాలకు, ఇతర భవనాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన స్పష్టం చేశారు.