News April 3, 2025
ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి: ADB SP

ట్రాఫిక్ సిబ్బందితో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరాలను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలం దృష్ట్యా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News April 10, 2025
ADB: రెండు బైకులు ఢీ ఇద్దరు మృతి

ఇంద్రవెల్లి మండలం ధనోరా(B) గ్రామం పిప్పిరి ఎక్స్ రోడ్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా అంబులెన్స్‌లో అదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.