News March 16, 2025
ADB: మద్యం మత్తులో ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్‌పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్‌కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.
Similar News
News February 23, 2026
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో వాసన వస్తుంటే.. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది. * బంగాళదుంప ముక్కలను మజ్జిగలో నానబెట్టి ఫ్రై చేస్తే అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. * దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి. * ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడగాలి.
News February 23, 2026
రామచంద్రపురం: గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ

HYD నుంచి గోవాకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిందని డిపో మేనేజరు తెలిపారు. ఈనెల 25న BHEL నుంచి బయలుదేరే ఈ బస్సు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్ ఆలయాల మీదుగా గోవాకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం మార్చి 1న ఉదయం 6 గంటలకు గోవా నుంచి MGBS మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు.
News February 23, 2026
పెళ్లి ముసుగులో మోసం.. అమ్మాయిలూ జాగ్రత్త: సజ్జనార్

TG: HYDలో పెళ్లి పేరుతో పెరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని CP సజ్జనార్ తెలిపారు. నిశ్చితార్థమయ్యాక శారీరకంగా దగ్గరవుతున్నారని, ఆ తర్వాత భారీగా కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రేమ పేరుతోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. ఈ మోసాలపై యువతులు షీ టీమ్స్ వాట్సాప్(9490616555), డయల్ 100కి ఫిర్యాదు చేయవచ్చన్నారు.


