News March 16, 2025

ADB: మద్యం మత్తులో ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

image

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్‌పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్‌కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.

Similar News

News April 21, 2025

SVU పరీక్షల వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News April 21, 2025

IPL: టాస్ గెలిచిన కేకేఆర్

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsGT మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్‌ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్

KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్

News April 21, 2025

‘హైదరాబాద్‌కు రండి’.. జపాన్ కంపెనీలకు సీఎం ఆహ్వానం

image

TG: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.

error: Content is protected !!