News May 19, 2024

ADB: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MP అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములు, మెజారిటీలపై గ్రామగ్రామాన చర్చ నడుస్తోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారట. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

Similar News

News December 11, 2024

మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి

image

కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.

News December 11, 2024

మంచిర్యాల: చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె మృతి

image

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పురుగు మందు తాగి <<14839477>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య(60), అతడి కుమార్తె చైతన్య(30) మృతి చెందారు. భార్య శ్రీదేవి(50), కుమారుడు శివ ప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

News December 11, 2024

MNCL: పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటేలిఖితపూర్వకంగా తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 2, 2,730 కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.