News March 3, 2025

ADB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJP తరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతిచ్చింది.

Similar News

News October 27, 2025

రేపు విజయవాడలో భారీ వర్షాలు.. బయటకు రావొద్దని వార్నింగ్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454

News October 27, 2025

KMR: మద్యం దుకాణాల లక్కీ డ్రా పూర్తి

image

కామారెడ్డి జిల్లాలోని 49 నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ సోమవారం పూర్తయింది. సిరిసిల్ల రోడ్డులోని కళ్యాణ దేవి మండపంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ 49 దుకాణాలను దక్కించుకునేందుకు మొత్తం 1502 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు. విజేతల పూర్తి వివరాలను DPEO హనుమంత్ రావు కాసేపట్లో వెల్లడించనున్నారు.

News October 27, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్‌ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.