News April 3, 2025

ADB: ‘మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి’

image

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులు, సంఘ నాయకులకు సూచించారు. బాబూ జగ్జీవన్ రాం, బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సంబంధించి బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టరేట్లో సన్నాహక సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న బాబు జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి, 14న బీఆర్‌ అంబేడ్కర్ 134వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.

Similar News

News April 11, 2025

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి: ADB SP

image

ట్రాఫిక్ సిబ్బందితో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరాలను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలం దృష్ట్యా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News April 10, 2025

ADB: రెండు బైకులు ఢీ ఇద్దరు మృతి

image

ఇంద్రవెల్లి మండలం ధనోరా(B) గ్రామం పిప్పిరి ఎక్స్ రోడ్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా అంబులెన్స్‌లో అదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.

News April 10, 2025

ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

image

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.

error: Content is protected !!