News March 27, 2025
ADB: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత

మాజీ మంత్రి జోగురామన్నను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి పెంచుతామన్నారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
News November 12, 2025
ఆదిలాబాద్ పోస్టుల వివరాలు ఇవే.!

ADB జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలు, బాలికల హాస్టల్ అనుబంధ మోడల్ స్కూల్లల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే KGBV ఆదిలాబాద్ రూరల్, అర్బన్, బేలా, మావల, తోషం మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే బాలికల హాస్టల్ బంగారిగూడలో నాలుగు పోస్టులు హెడ్ కుక్(1), అసిస్టెంట్ కుక్(2) వాచ్ ఉమెన్(1) నాలుగు పోస్టులు ఉన్నాయన్నారు.
News November 12, 2025
ఆదిలాబాద్లో JOBS.. అప్లై NOW

ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


