News March 28, 2024
ADB: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
Similar News
News December 11, 2025
ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్గా గెలుపొంది ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.


