News March 28, 2024

ADB: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Similar News

News January 16, 2025

ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP

image

భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News January 16, 2025

సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి: ADB కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హాల్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పీవో ఖుష్బూ గుప్తా హాజరయ్యారు.

News January 15, 2025

క్రీడలతో శారీరక ఆరోగ్యం: బోథ్ MLA

image

నేరడిగొండ మండలంలోని బొందిడిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు.