News July 21, 2024
ADB: ముంభై పోలీసులమంటూ వైద్యురాలికి టోకరా
ఈనెల 12న ADB రిమ్స్ వైద్యురాలికి తాము ముంబై పోలీసులమని చెబుతూ ఫోన్ వచ్చింది. ‘మీ ఐడీపై నేరాలు నమోదయ్యాయి’ అని చెప్పడంతో భయంతో వారి మాటలు నమ్మిన ఆమె రూ.3.40 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ నంబర్‌కు ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రూ.లక్ష హోల్డ్ చేయగా శనివారం మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Similar News
News October 12, 2024
ADB: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
కుంటల: ఒకే ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు
ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కుంటల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఏడుగురికి ప్రభుత్వ కొలువులు దక్కాయి. విశాల, సృజన, విజయలక్ష్మి, మహ్మద్, ప్రశాంత్, సంపత్, సాయికిరణ్ (SA) టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నారు. కల్లూరు ఉద్యోగుల సంఘం నేతలు వీరిని సన్మానించారు. ఒకే ఊరికి చెందిన ఏడుగురికి ఉద్యోగాలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. MEO ముత్యం, పంచాయతి సెక్రటరీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
News October 11, 2024
మంచిర్యాల: ఒకే గ్రామంలో నలుగురికి టీచర్ ఉద్యోగాలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలోని నలుగురు డిఎస్సిలో ఒకే ప్రయత్నంలో టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఏకారి ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు పుప్పాల మానస, రవళి, మానస ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ చదవించి ఉద్యోగాలు సాధించారు. ఒకే గ్రామం నుంచి నలుగురు టీచర్ ఉద్యోగాలు పోందినందుకు గ్రామస్థులు మిత్రులు అభినందించారు.