News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Similar News
News October 28, 2025
పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్‌ప్రెస్), కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News October 28, 2025
ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

హానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.
News October 28, 2025
కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.


