News March 5, 2025

ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

image

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

Similar News

News March 23, 2025

రోడ్డు ప్రమాదంలో హిందీ టీచర్ స్పాట్ డెడ్ 

image

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టటూరు హరిజనవాడ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు మీద వెళ్తున్న కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ శివకేశవులు(45)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు వాహన దారులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెంటనే డెడ్ బాడీని వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

News March 23, 2025

యానాం సబ్ జైలు గోడదూకి పరారైన ఖైదీ

image

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైల్ నుంచి గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. సుమారు 25 అడుగులు సబ్ జైల్ గోడ పైనుంచి దూకి శనివారం పరారైనట్లు సమాచారం. ఒక దొంగతనం కేసులో శనివారం ఉదయం 7 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్లిన కనకాల పేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లు మధ్యాహ్నానికి పరారయ్యాడని చెబుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News March 23, 2025

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి 

image

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే  అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

error: Content is protected !!