News June 4, 2024

ADB: ముగిసిన రౌండ్లు.. మొత్తం మెజారిటీ ఎంతంటే.!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో BJP అభ్యర్థి గోడం నగేశ్ 86,883 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 23 రౌండ్‌ల కౌంటింగ్ ముగిసే సరికి 86,883 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. BJP 5,58,103, కాంగ్రెస్ 4,71,220, బీఆర్ఎస్ 1,36,380 ఓట్లు సాధించాయి. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 9,232 కలిపి మొత్తం 90,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Similar News

News November 13, 2024

చెన్నూర్: కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి పలు జాతీయ రహదారుల విషయంపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూరూ.100 రూ.100 జాతీయరహదారి- జాతీయ రహదారి- 63 విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.

News November 13, 2024

ADB: యువతిని గర్భవతిని చేసిన మేనమామ

image

తండ్రిలేని ఓ యువతిని మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాలు.. AP భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈనేపథ్యంలో ఆమె ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ADBకి వెళ్లాడు. ఈక్రమంలో అతడు కోడలిపై లైంగిక దాడి చేశాడు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.

News November 13, 2024

మంచిర్యాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జాఫర్ నగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు SI సనత్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రమీనా హుస్సేన్ సోమవారం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోకు వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు పగలగొట్టి చూడగా బాలిక ఇంట్లో ఉరేసుకొని ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై SI కేసు నమోదు చేశారు.