News April 29, 2024
ADB: మే 1 నుంచి ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల శిక్షణ

జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న 2107 మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల శిక్షణ కార్యక్రమం మే1 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. తేదీల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ శిక్షణ కార్యక్రమం కు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
జిల్లా వ్యాప్తంగా 31 కేసులు

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు
News April 24, 2025
పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.
News April 24, 2025
అదిలాబాద్ నుంచి సికింద్రాబాద్కు గంజాయి రవాణా

నిర్మల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాలిలా.. మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్ ఆదిలాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. బుధవారం వారిద్దరు కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని నగరానికి వస్తుండగా బోయిన్పల్లి వద్ద ఎక్సైజ్ SI శివకృష్ణ వీరిని అదుపులోకి తీసుకున్నారు.