News April 29, 2024
ADB: మే 1 నుంచి ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల శిక్షణ

జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న 2107 మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల శిక్షణ కార్యక్రమం మే1 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. తేదీల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ శిక్షణ కార్యక్రమం కు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.
Similar News
News April 15, 2026
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.
News April 15, 2026
జిల్లాలో సెగలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాధారణం కంటే 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, వారం రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ను అత్యవసరంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తతే ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుందని పేర్కొన్నారు.
News April 15, 2026
ADB: ’పల్లె వెలుగు’కు మాస్క్.. ఛార్జీల్లో ‘ఎక్స్‌ప్రెస్’

జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘పల్లె వెలుగు’ బస్సులకు ముందు భాగంలో ‘ఎక్స్‌ప్రెస్’ రంగులు వేసి, లోపల మాత్రం సాధారణ సౌకర్యాలతోనే నడుపుతున్నారు. కానీ, టికెట్ ఛార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్ ధరలకే వసూలు చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల్లో బస్సులు చాలా ఉన్నాయని, దీనివల్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.


