News April 9, 2025

ADB: రాంజీగోండు ఆశయసాధనకు పనిచేద్దాం: MP

image

గిరిజన మొదటి తరం స్వాతంత్ర పోరాటయోధుడు రాంజీగోండ్ 168వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని ఎంపీ గోడం నగేశ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. రాంజీగోండ్ చిత్రపటానికి ఎంపీ నగేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. బ్రిటిష్, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చేసిన గొప్ప స్వతంత్ర యోధుడు రాంజీగోండ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 28, 2025

KMM: ‘BRSతో CPM పొత్తు..!’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల BRS బలపర్చిన అభ్యర్థులకు CPM నేతలు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం ముదిగొండలో BRS, CPM మండల స్థాయి ఎన్నికల సమావేశాన్ని CPM మండల కార్యదర్శి పురుషోత్తం, BRS మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి నిర్వహించి స్థానికంగా తమ పార్టీలు పొత్తులో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు భద్రాచలంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్థికి CPM నేతలు మద్దతు తెలిపారు.

News November 28, 2025

సూర్యాపేట: ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

image

మోతె మండలం రవికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి భూక్యా ఉప్పయ్యను సర్పంచ్‌గా ఎన్నుకున్నాయి. మోతె మండలంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు ప్రకటించారు.

News November 28, 2025

ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

image

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iimv.ac.in