News July 14, 2024

ADB: రానున్న 5 రోజులు భారీ వర్షాలు

image

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్ష సూచన ఉందని ప్రకటించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Similar News

News October 13, 2024

బాసర అమ్మవారికి దిల్ రాజు పూజలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.

News October 13, 2024

కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు

image

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

News October 13, 2024

ఆసిఫాబాద్: ‘లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి’

image

కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.