News March 27, 2025

ADB: ‘రాముల వారి తలంబ్రాలు కోసం సంప్రదించండి’

image

భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా భక్తుల ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నట్లు రీజినల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో రాములవారి తలంబ్రాల పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులు కార్గో కౌంటర్లలో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రీజియన్ పరిధిలో దాదాపు 1000 మంది భక్తులు తలంబ్రాల కోసం బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News April 22, 2025

ADB: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష వచ్చే ఆదివారం ఏప్రిల్ 27న ఉంటుందన్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7-10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News April 22, 2025

ADB: పాపం.. 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేశారు..!

image

నేరడిగొండ మండలంలోని ఓ బాలిక(16)కు మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.

News April 22, 2025

ADB: వడదెబ్బతో ఒకరి మృతి

image

వడ దెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన నార్నూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్(60) ప్రతి రోజు వెళ్లినట్లుగా సోమవారం ఉపాధిహామీ పనికి వెళ్లి పని పూర్తిచేసుకొని తిరిగి ఇంటికొచ్చాడు. దాహంగా ఉండడంతో మంచినీరు తాగి సేద తీరుతామని మంచంపై కాసేపు పడుకుంటామని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడికే కుప్పకూలిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరారు.

error: Content is protected !!