News November 27, 2024
ADB: రిమ్స్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించిన నోడల్ అధికారి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డ్రగ్ స్టోర్ ను వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వలపై తో పాటు రిజిస్టర్లు పరిశీలించారు. మందుల కొరత నివారించడానికి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్. నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, తదితరులు ఉన్నారు.
Similar News
News December 2, 2024
నిర్మల్: ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్‌లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్‌ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 1, 2024
లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్
లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.
News November 30, 2024
లింగాపూర్: ఎంపీడీవో గుండెపోటుతో మృతి
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎంపీడీవో రామేశ్వర్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో అదిలాబాదులోని నివాసంలో ఎంపీడీవో రామేశ్వర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ లింగాపూర్ మండలానికి ఎంపీడీవోగా సేవ చేసిన రామేశ్వర్ మృతి పట్ల మండల వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.