News April 19, 2024
ADB: రిమ్స్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
Similar News
News February 23, 2026
నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2026
తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
News February 22, 2026
కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.


