News April 19, 2024
ADB: రిమ్స్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
Similar News
News July 10, 2025
ADB అదనపు కలెక్టర్‌కు ఐద్వా సర్వే రిపోర్ట్

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై వారం రోజులుగా సర్వే నిర్వహించారు. గురువారం సర్వే రిపోర్టును ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో, రిమ్స్‌లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. బెల్ట్ షాపులను తొలగించాలని, కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మంజుల, జమున తదితరులున్నారు.
News July 10, 2025
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.
News July 10, 2025
ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.