News April 4, 2025
ADB: రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రెన్యువల్ కాని మందు బార్లకు నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి హిమశ్రీ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 26 లోపు దరఖాస్తుల సమర్పించాలని దరఖాస్తు చేసుకునేవారు రూ.లక్ష డీడీ లేదా చలాన్ గాని District Probation and Excise officer పేరిట తీసి, 3 పాస్ ఫోటో, ఆధార్ లేదా పాన్ కార్డులతో దరఖాస్తుల సమర్పించలాన్నారు. వివరాలకు 8712658771 సంప్రదించాలని కోరారు.
Similar News
News April 23, 2025
MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.
News April 23, 2025
9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.