News August 7, 2024
ADB: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

TOSS ఓపెన్ స్కూల్ విధానంలో 2024-25 సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖధికారిణి ప్రణీత తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా AUG 8 నుంచి SEP 10 వరకు, అపరాధ రుసుంతో SEP 11 నుంచి OCT 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>> SHARE IT
Similar News
News November 25, 2025
ADB: ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న ఎస్బీఐకి చెందిన రెండు ఏటీఎంలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ఏటీఎంలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఏపీ ప్రకాశం జిల్లా చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
News November 24, 2025
ADB: రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని, అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేశారు.
News November 24, 2025
ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.


