News March 11, 2025

ADB: రేపు జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

Similar News

News April 19, 2026

సప్లిమెంటరీ అభ్యర్థులకు స్పెషల్ కోచింగ్: ADB DIEO

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని DIEO జాదవ్ గణేశ్ కుమార్ ఆదేశించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు సమన్వయంతో విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News April 19, 2026

ADB: రేపటి నుంచి OPEN టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యాసకులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, కేవలం పెన్, ప్యాడ్ మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News April 19, 2026

ADB: రీ కౌంటింగ్, వెరీఫికేషన్ దరఖాస్తుకు రేపే ఆఖరు

image

ఇంటర్మీడియట్ విద్యార్థులు రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు అవకాశం ఉందని DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, రీ-వెరిఫికేషన్ కోసం రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. విద్యార్థులు http://tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.