News December 7, 2024
ADB: రేవంత్ రెడ్డి ఏడాది పాలన పై REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి ADB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, కుప్టీ, తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్ట్ నిర్మాణం, కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?
Similar News
News January 15, 2025
కౌటాల: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్పీ దేవి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని, 3 కోడిపుంజులు, నగదు రూ.3900, 3 కోడి కత్తులు స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News January 15, 2025
నిర్మల్: జనవరి 22 వరకు అర్హులను ఎంపిక చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈనెల 22 వరకు పంచాయతీలలో గ్రామ సభలను, పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేయాలని అధికారులకు వీసీలో ఆదేశించారు.
News January 14, 2025
BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.