News August 26, 2024
ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.
Similar News
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.
News January 12, 2026
ఆదిలాబాద్: 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఈ నెల 19వ తేదీన ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సోమేశ్ తెలిపారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండుతో నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.