News August 11, 2024
ADB: రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ యువకులు మృతి
గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే. వన్ టౌన్ CI ఇంద్రసేనా రెడ్డి వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రామ్ గాట్, సత్యేంద్ర మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నారు. పని ముగించుకుని గోదావరిఖని మీదుగా యైటింక్లైన్ కాలనీకి బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News September 18, 2024
భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం
భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.
News September 17, 2024
ఆదిలాబాద్: ఆర్టీసీ గమ్యం యాప్‌పై ప్రయాణికులకు అవగాహన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2024
SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు
కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.